శంకరాభరణానికి 40 సంవత్సరాలు
భారతీయ చలనచిత్రంలో అజరామర సినిమా శంకరాభరణం. ఈ సినిమా 1980 ఫిబ్రవరి 2 న విడుదల అయ్యింది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ సినిమా చూడవల్సిందే. పరభాషా సినిమా అభిమానుల్ని సైతం అక్కున చేర్చుకుంది ఈ సినిమా. ఆ సుస్వర సంగీత సాగరంలో మునిగి తేలారు. తన్మయులై తరించారు. ఆ మహత్తర రూపశిల్పి కాశీనాథుని విశ్వనాధ్ ఆ సినిమా గురించి చెప్పిన విషయాలు.
40 ఏళ్లనాటి ఓ ఫోటో ఆల్బమ్ ను ఇప్పుడు చేతిలోకి తీసుకొని చుస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అదే భావన కలుగుతుంది. ఇప్పటికి శంకరాభరణం గురించి జనం తల్చుకుంటున్నారు. అందులో పాత్రలు సన్నివేశాలు, సంభాషణల గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ చిత్రం ఎంత చిరంజీవత్వం పొందిందో అర్ధం అవుతుంది. ఆ చిత్రాన్ని నేను మర్చిపోలేను జనం మరిచిపోలేరు. మరో అరవై ఏళ్ల తరువాత అయినా నేను లేకపోయినా నిండు నూరేళ్లు ఈ సినిమాను తలచుకుంటారు.
సిరిసిరిమువ్వ షూటింగ్ పూర్తి చూసుకొని ఊటీ నుండి కారులో చెన్నై వస్తుంటే అంతర్లీనంగా ఓ ఆలోచన మొలకెత్తింది. ఈ అంశం మీద సినిమా చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింధీ? అని అడిగారు. మా అత్తయలకో, మామయ్యలకో ఇవాళ కర్ణాటక సంగీతం గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ తరానికి దాని గొప్పతనాన్ని చెప్పాలి అని జవాబిచ్చాడు.
అగ్ర కథానాకులతో సినిమాలు తీసిన అనుభవం ఉంది కొత్తవారిని ఎంచుకున్నారు ఎందుకు?
అక్కినేని శివాజీ గణేశన్ వంటి వారిని కొందరు సూచించారు. కానీ ఏ ఇమేజ్ లేని వారైతేనే శంకరాశాస్త్రి పాత్రకు సరిపోతాడని నా నమ్మకం. ఎవరు దొరక్కపోతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి అప్ కమింగ్ ఆర్టిస్టునైనా తీసుకవచ్చి ఆ పాత్ర చేయించాలని అనుకున్నాను. అదే సమయంలో రమణమూర్తి గారి ద్వారా అయన అన్నయ సోమయాజులు గారు మా దృష్టికి వచ్చారు.
శంకరశాస్త్రి, తులసి మధ్య సంభాషణలు ఉండవు ఎందుకంటే అవసారినికి మించిన సంబాషణలు పెట్టడం ఇష్టం ఉండదు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి మధ్య సైతం సంబాషణలు తక్కువే ఉంటాయి. మాటలే కాదు సంగీతం విషయంలోనూ అదే పొదుపు పాటిస్తాను. కొన్నిసార్లు శబ్దం కంటే నిశ్శబ్దమే ఎక్కువగా భావాలను అందిస్తుంది. దాని మీదే నేను ఎక్కువగా అదరపడుతాను. శంకరాభరణినికి సంబందించిన ఈ ఆలోచనలు అన్నేను చేసినవే. నాకు కావాల్సిన దానిని నటీనటులు, సాంకేతిక నిపుణులకు విడమర్చి చెప్పి వారి నుండి పొందాను. మతాల రచయిత జంధ్యాల, పాటలా రచయిత వేటూరి, సంగీత దర్శకులు మహదేవన్ వీళ్ళందరూ కథా చర్చలో పాల్గొనేవారు. అయితే ఆయా సందర్భాల్లో లోతుగా వివరించడం ద్వారా నాకు కావాల్సిన అవుట్ ఫుట్ పొందేవాడిని. అలానే బాలసుబ్రమణ్యం చక్కని గాయకుడే అయినా ఈ సినిమాలోని పాటల కోసం శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని కస్టపడి పాడాడు. బాలు మహేంద్ర మాత్రం కొద్దీ రోజులు పనిచేసిన తరువాత దర్శకత్వ అవకాశం రావడంతో అయన అసిస్టెంట్ మూర్తి సినిమా పూర్తి చేసారు.
ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి విశేషమైన స్పందన వచ్చిందంట కదా!
అవును. ఆ అనుభవం గమ్మతుగా ఉండేది.ప్రీమియర్ షో చూసి మా దగ్గరికి రావడం కన్నీళ్లు పెట్టుకోవడం. గుమ్మడి గారు సినిమా చూసి ఆ రాత్రి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చారు. కొద్దిసేపు మాట్లాడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు. అప్పటికే ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఓదార్చడం మా వల్ల కాలేదు. సినిమా విడుదల అయినపుడు ఎన్నో ఎన్నెనో ప్రశంసలు. సినిమా బాగా ఆదరణ పొందాలనే భావనతోనే పని చేస్తూ పోయాం. అయితే అవార్డులు, రివార్డులు ఈ స్థాయిలో వస్తాయని ముందే ఉహించమనడం సరికాదు. జాతీయ స్థాయిలోను సినిమాకు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు లభించాయి. ఏ లాబీయింగ్ చేయకుండానే ఈ అవార్డులు రావడం ఆనందకరం. వీటి అన్నిటికంటే కాకినాడ నుండి కన్యాకుమారి వరకు ఇవాళ్టికి ఈ సినిమాను జనం తలుచుకున్నారంటే అంతకంటే ఎం కావాలి.