Skip to content

Poddu Meeda Poddaye Song Lyics in Telugu

    Poddu meedha poddaye song is released by the Pkr world. This folk song lyrics are written by the Rajkumar pogula. Music given by the GL Namdev. poddu meedha poddhaye song sung by the singer shirisha.

    Poddu meeeda poddaye song lyrics in telugu:

    పొద్దు మీద పొద్దయే
    పొద్దుగడవా కాపాయే
    పొద్దంతా నీ ధ్యాసే చెప్పలేనిదీ గోసే
    హొయ్ హొయ్ హొయ్ నీ సూపుల సెగలు
    నా మనసునేమో తాకే వెచ్చని ఊహలు
    హొయ్ హొయ్ హొయ్ నీ సూపుల సెగలు
    నా గుండెలోను దాగెను సిత్రాల అలకలు

    పులిసింత చెట్టు కింద
    పొలమారినట్టాయె
    పులకింతల నా ఈడుకు కవ్వింపులు మొదలాయె
    హొయ్ హొయ్ హొయ్ నీ నవ్వుల విల్లు
    నా ఒంటి పైనే కురిసే తేనెల జల్లు
    హొయ్ హొయ్ హొయ్ నీ నవ్వుల విల్లు
    నా గుండెలోన విరిసె రంగుల హరివిల్లు

    దొరగారి తోటలోన దొర జామ పండుపైన
    చిలకల పలుకులు వింటే నీ మాటలు యాదికొచ్చే
    హొయ్ హొయ్ హొయ్ నీ మాటల సడులు
    నా మదిలోన ఎగిసె తీయని గాయాలు
    హొయ్ హొయ్ హొయ్ నీ మాటల సడులు
    నా ఈడునేమో మత్త కొలుపే కొంటె పలుకులు

    మాపటేలి గంగవ్వ ఇంటి ముందు ముచ్చట్ల
    నీ పేరే పొగడంగా నా పానం జడపంగా ఆ…
    హొయ్ హొయ్ హొయ్ నీ ఊసుల సుడులు
    నా ఈడునేమో కమ్మేసే సిగ్గుల వలలు
    హొయ్ హొయ్ హొయ్ నీ ఊసుల సుడులు
    నా ఉపిరినేమో ఆపె నీ రూపు రేఖలు

    ఊట చెలి మల్లె నీరు దోసిలి పట్టి తాగించి
    జారుడు బండలా మీద నీ అడుగుల అడుగేస్తి
    హొయ్ హొయ్ హొయ్ నీ జ్ఞాపకాలు
    నా గుండెల్లో ఆడే దాగుడు మూతలు
    హొయ్ హొయ్ హొయ్ నీ జ్ఞాపకాలు
    కుదురుగా ఉంచలేవు నా ప్రాణాలు

    నా సేతి మీద పచ్చ బొట్టు
    నీ రూపు తలుచుకుంటూ
    మనసు నిన్ను సుట్టుకుంటూ
    మదిల నిన్ను మందలిస్తూ
    హొయ్ హొయ్ హొయ్ నాలోని భావాలు
    కనురెప్ప కింద దాచేచిన నాటి గుర్తులు
    హొయ్ హొయ్ హొయ్ నాలోని భావాలు
    మత్తడి లేకుండా పొంగే యద దారాలు

    పట్టపగటి వేళల్లో ఆ పగటి రూపుల్లో
    చిటికనేలు పట్టుకొని నీయంట అడుగేస్తి
    హొయ్ హొయ్ హొయ్ నాలోని శ్వసలు
    కలలో కూడా వీడనంటాయ నీ జాడలు
    హొయ్ హొయ్ హొయ్ నాలోని ప్రాణాలు
    కనులలో చేస్తున్నాయి నీకై జాగారాలు

    Song Details:
    Song: Poddu Meeda poddaye
    Lyrics: Raj Kumar
    Music: GL Namdev
    Singer: Shirisha
    Music Label: Pkr World

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *