పెంపుడు జంతువులంటే ప్రేమ

ప్రముఖుల దగ్గర పెంపుడు జంతువులు ఉండటం మాములే కానీ, వీళ్ళు మాత్రం మరో అడుగు ముందుకేసి పెంపుడు జంతువుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమంటూ వాటి పైన తమకున్న ప్రేమను ఇలా చాటుకున్నారు.

dog images

విరాట్ కోహ్లీ కూడా చిన్నప్పటి నుండి జంతు ప్రేమికుడే. అలాగని కేవలం కుక్కల్ని పెంచుకోవడంతోనే ఆగిపోలేదు. ఆ మధ్య ఓ ఏనుగును సవారి పేరుతో హింసిస్తున్నారని తెలిసి అక్కడి అధికారులకు దాన్ని వదిలేయమంటూ ఉత్తరం రాశాడు. ఓ సారి బెంగుళూరులోని చార్లీ ఏనిమల్ రెస్క్యూ సెంటర్ కి వెళ్లిన కోహ్లీ అక్కడవున్న పెంపుడు జంతువుల పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న పదిహేను కుక్కల్ని దత్తత తీసుకొని వాటి సంరక్షణకు సంబందించిన ఖర్చులన్నీ తానె భరిస్తూ ఎప్పటికప్పుడు వాటి సమాచారం తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే తాను స్వయంగా పెంచుకుంటున్న డ్యూడ్, బ్రూనో కుక్కలంటే విరాట్ కోహ్లీకి చెప్పలేనంత ఇష్టం. ఈ మధ్య బ్రూనో చనిపోయిందని ఏంతో బాధపడుతు ట్విట్టర్ లో పోస్టు చేశాడు. విరాట్ కోహ్లీకి జంతువుల పైన ఉండే ప్రేమను గుర్తించిన పెటా ఇండియా ఇతడికి కిందటి సంవత్సరం “పెటా పర్సన్ అఫ్ ది ఇయర్” గా గుర్తింపు ఇవ్వడం విశేషం.

రాంచరణ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఇంటికొస్తే మాత్రం మొదట తన బ్రాట్ కుక్క ఎలా ఉందొ తెలుసుకున్నాకే మిగిలిని పనుల గురించి ఆలోచిస్తాడట. థాయిలాండ్ జాక్ రసెల్ బ్రీడ్ జాతికి చెందిన ఈ కుక్కను రామ్ చరణ్ కు ఒకప్పుడు ఉపాసన పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. అంతకు ముందు కూడా అతని దగ్గర బ్రాట్ పెరియహు ఓ కుక్క ఉండేది.ఓ సారి తానూ జాగింగ్ కు వెళ్తూ దాన్ని వదిలేయడంతో అది కారు కింద పది చనిపోయిందట. ఆ తరువాతే దాన్ని ఉపాసన ఇవ్వడంతో పాత కుక్క పేరు పెట్టేశాడు. అయితే కొన్నాళ్ల క్రితం కుక్క కాలు ఫ్రాక్చర్ కావడంతో నడవలేకపోయిందట. ఆ బాధను చుసిన రామ్ తన బ్రాట్ త్వరగా కోలుకోవాలని మాంసాహారం మానేస్తానంటూ మొక్కుకున్నాడు.

dog wallpaper

పూరి జగన్నాథ్ గారికి కుక్కలంటే చాల ఇష్టం. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి రకరకాల బ్రీడ్ కు సంబందించిన కుక్కల్ని పెంచుకుంటున్నాడు. ఇపుడు పూరి ఇంట్లో పాతిక ఆఫీస్ లో నాలుగుకు పైగా కుక్కలుంటాయి. అయితే ఒకానొక సమయంలో సినిమాలతో బాగా నష్టపోయిన పూరి వాటికీ ఆహారం పెట్టలేక కొన్నిటిని తెలిసినవారికి ఇచ్చేశారట. మళ్ళి పుంజుకున్నాక ఇచ్చిన వాటినన్నిటిని తిరిగి తెచుకున్నాడట. ఇలా వెనక్కి తెచ్చుకునే వాటిలో ఓ కుక్క తనను చుసిన తోక ఊపేది కాదని అది కిందటేడాదే చనిపోయిందని ఇప్పటికి బాధపడతాడని దర్శకుడు షూటింగ్ చేస్తున్న ఇంట్లో ఉన్న ముఖ్యంగా మూడ్ బాగాలేకపోతే మాత్రం అవి పక్కన ఉండేలా చూసుకుంటాడు పూరిజగన్నాథ్.

సాధారణంగా అందరి దగ్గరకుక్కలు, పిల్లులు ఉంటె అనసూయ దగ్గర మాత్రం పక్షులు కనబడుతాయి. చిన్నపటి నుండి కుక్కల్ని పెంచిన అనసూయ పెళ్ళైన తరువాత పక్షులను పెంచుతుంది. ఎందుకంటే వారి అత్తగారికి కుక్కలంటే భయం అని తెలిసి కుక్కలని పెంచడం మానేసింది. ఒకసారి ఒక పక్షిని బయటకు తీసుకొని వస్తే అది ఎగిరిపోయిందట అది తిరిగి రావాలని తిరుపతికి వెళ్లి మరి మొక్కుకుంది అట. అది రాకపోవడంతో ఆమె భర్త మరో పక్షిని కానుకగా ఇస్తే మరోదాన్ని దత్తత తీసుకుంది. ఇప్పుడు ఆమె దగ్గర మూడు విదేశీ జాతుల పక్షులు ఉన్నాయి వాటి పేర్లు హ్యాపీ, బడ్డీ, ఎల్లో అని చెబుతుంది. ఒక మంచి ఇల్లు తీసుకొని అందులో కొంతభాగం పక్షుల కోసం చెట్లు పెంచేలా ప్రణాళికలు కూడా ఉన్నాయని చెబుతుంది.

parrot image

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *