ఓటీటీలో సినిమాల పరిస్థితి ఏంటి?

సినిమా థియేటర్లు మూతపడి దాదాపు నాలుగు నెలలు అయింది. ప్రతివారం విడుదల అయ్యే సినిమాను వీలైనంత త్వరగా చూస్తే కానీ నిద్రపట్టని జనం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కరోనా భయంతో కొంత, లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వీరందరికి కాలక్షేపం సినిమాలే. టీవీలో రెండున్నర గంటల సినిమాను మూడు నాలుగు గంటలు ప్రసారం చేస్తే చూసే ఓపిక చాల మందికి తక్కువే. వాళ్ళందరూ ఓటిటీ వైపు మొగ్గు చూపారు. గత నెలలుగా పాత సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు అమెజాన్ కొత్త సినిమాలను విడుదల చేస్తున్నామని చెప్పగానే ఎగిరి గంతేశారు. ఓటీటీ లో విడుదల అయినా పోన్ మగల్ వందాల్, గులాబో సీతాబా, పెంగ్విన్ తెలుగు సినిమాలు అయినటువంటి ఉమామహేశ్వర ఉగ్ర రూపాస్యా, లీల, భానుమతి రామకృష్ణ ఇంకా కొన్ని సినిమాలు ఈ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. వీటికి అనుకున్నంత ఆదరణ లభించిందా?

ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఇప్పటి వరకు పలు చిత్రాలు విడుదల అయ్యాయి. కానీ ఇందులో ఏ ఒక్కటి అన్ని వర్గాలను సంతృప్తి పరిచేది కాకపోవడం బాధాకరం. నిజానికి ఇప్పుడు విడుదల అయినా సినిమాలు వాటి జానర్ గమనించినపుడుదర్శక నిర్మాతలు బాగా ఆలోచించే తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేసారు. ఈ సినిమాలు థియటర్ లో విడుదల అయినా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తాయి తప్ప ఘనవిజయం సాధించే సినిమాలు కావు.

movies in ott platform

పోన్ మగల్ వందల్ సినిమా కోర్ట్ జానర్ కి సంబంధించినది. థ్రిల్లర్ మూవీ బిగువైన స్క్రీన్ ప్లే ఆసక్తి కలిగించే సన్నివేశాలు ఉన్నపుడే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించవచ్చు. అమితాబ్ఆ, యుష్మాన్ ఖురణతో సుజిత్ తెరకెక్కించిన గులాబో సితాబో సమాజంలోని వాస్తవాలను తెలియజేస్తూ ప్రేక్షకులకు వేసిన ఓ చేదు గుళిక. పురాతన నగరం లక్నోలో వందేళ్ల నాటి ఫాతిమా మహల్ అనే హవేలీ నేపథ్యంలో సాగే కథ. రెండు గంటలకు పైగా చేదు సంఘటనలను టీవీ స్క్రీన్ మీదనో, పీసీలోనో, మొబైల్ లో చూడటం కష్టమే. అందుకే ఈ సినిమాకు కొంత విమర్శలు, ప్రశంసలు దక్కిన ఆశించిన స్థాయిలో అభినందనలు రాలేదు.

ఇగ తెలుగు, తమిళ భాషలో విడుదల అయినా పెంగ్విన్ చిత్రానిది ఇదే పరిస్థితి. కొండా ప్రాంతంలో నివాసం ఉండే రిథమ్ కు చెందిన కథ. తమిళంతో పాటు తెలుగులో కూడా తీశామని నిర్మాత చెబుతున్న డబ్ చేసిన సినిమాగానే అనిపిస్తుంది. ఫస్టాఫ్ కథనంలో ఉన్న బిగువ సెకండాఫ్ వచ్చే సరికి సడలిపోతుంది. ఇలాంటి సినిమాలు థియేటర్ లో విడుదల అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టినట్టే అవుతుంది.

ఇప్పుడిప్పుడే విడుదల అయినా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పాజిటివ్ టాక్ తో మొదలైంది. ఎంత వరకు విజయం సాధించిందో ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. భానుమతి రామకృష్ణ, లీల సినిమాలు కూడా విడుదల అయినా అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.

movies in ott platform

పై చిత్రాలలో నటి నటుల నటన అద్భుతం. కానీ ఎంచుకున్న కథాంశాలు, దర్శకుల ఆలోచన ధోరణి కారణంగా ఇవన్నీ ఒక్క వర్గానికి నచ్చే చిత్రాలయ్యాయి. ఇందులోని కొన్ని సినిమాలు సగం చూసి వేరే ఛానల్ వేరే ప్రోగ్రాం మారిపోయే ఛాన్స్ ఓటీటీలో ఉంది. నచ్చని సినిమా కోసం రెండు గంటలు వృధా చేసుకునే ఆస్కారం ఉండదు. అందువల్ల ఇలాంటి చిత్రాలకు ఓటీటీ కరెక్ట్ అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అయినా జనరంజకమైన చిత్రాలు ఈ ప్లేట్ ఫామ్ మీద వస్తాయేమో చూద్దాం.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *