ఇండియాలో ఆత్మహత్య చేసుకున్న నటీ నటులు

ఇదివరకటితో పోలిస్తే అవకాశాలు మెండు. రెమెనూరేషన్ సంతృప్తికరంగానే ఉంటుంది. ఫాలోయింగ్ ఉన్నపుడే లైఫ్ ను సెటిల్ ఎరుక హెచ్చింది. ఈ సంపాదన మరో రంగంలో మదుపుగా పెట్టాలని ఆలోచన వచ్చింది. పాతతరం నటీనటుల్లో ఎముకలేని దానాలతో కస్టర్జితాన్ని కరిగించుకోవట్లేదు. అవసరం ఉన్నపుడు మాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇంతగా ప్లాన్ చేసుకున్నా ఈ షెడ్యూల్ లో హఠాత్తుగా ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన అందరిని కంటతడి చేసింది. 14 జూన్ 2020 న అయన తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు .బయటకు కనిపించే కారణాలవరకు అవకాశాలు నిండుగానే ఉన్న ఒంటరితనం, డిప్రెషన్ కి లోనై సూసైడ్ చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇలాగే సినీ పరిశ్రమ లో చాలా నటి నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

సుశాంత్ సింగ్ రాజపుత్:

సుశాంత్ సింగ్ 21 జనవరి 1986 లో మాల్దియా (పూర్ణియా జిల్లా) బీహార్ లో జన్మించారు.2008 లో బాలాజీ టెలీఫిలిమ్స్ లో ఏజుట్స్ ప్లేస్ లో తన మొదటి నాటకం వేశారు.తన మొదటి సినిమా ‘కాయ్ పో చే’ లో నటించారు. ms ధోని సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

Sushanth singh Rajput
Sushanth Singh Rajput

ప్రేక్ష మోహతా:

క్రైమ్ పెట్రోల్ (క్రైమ్ సీరియల్) యాక్టర్. వయసు 26 ఏళ్ళుఇండోర్ లో తన ఇంట్లో మే 26 న ఊరితో జీవితాన్ని అంతం చేసుకుంది. కెరీర్ కు సంబంధించిన ఆందోళన వ్యాకులత నిరాశలతో బాధపడుతున్నట్లు సూసైడ్ నోట్ లో రాసింది.

కునాల్ సింగ్:

ప్రేమికుల రాహు సినిమా హీరో కునాల్ సింగ్ కూడా 2008 ఫిబ్రవరి 7 న ఉరివేసుకొని చనిపోయాడు. అంతకు ముందు కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి మణికట్టు కోసుకున్నాడు.

జియా ఖాన్:

రాంగోపాల్ వర్మ నిశ్శబ్ద్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది జియాఖాన్. అమీర్ ఖాన్ సినిమా గజినీలోను నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013 జూన్ 3 న బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలి తో ప్రేమ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకుంది.

సిల్క్ స్మిత :

ఈమె తెలియని వారు ఎవరు లేరు. వందల సినిమాల్లో నటించి అప్పటి యువతకు ఆరాధ్య దేవతగా నిలిచింది. 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని సినిమా అభిమానులందరినీ కంటతడి పెట్టించింది.

ఉదయ్ కిరణ్:

చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఉదయ్ కిరణ్ నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాతో ఫెవరెట్ నటుడుగా మారాడు. 2014, జనవరి 5న ఆర్థిక ఇబ్బందులతో డిప్రెషన్ కు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగనాథ్:

ఒకప్పటి తెలుగు హీరో, క్యరెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 300 కు పైగా సినిమాలో నటించిన రంగనాథ్ 2015లో డిసెంబర్ 19న బలవన్మరణంతో ఈ లోకాన్ని విడిచిపోయాడు.

గురుదత్:

వసంత్ కుమార్ శివశంకర్ పదుకొనె తెర మీద గురుదత్ టైటిల్ కార్డుతో కనిపించాడు మరియు అలరించాడు. ప్యాసా, కాగజ్ కే ఫుల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌద్వి కా చాంద్ సినిమాలు ఇప్పటికి గురుదత్ను ఇంకా సజీవంగా నిలుపుతున్నాయి. 1964, అక్టోబర్ 10 న ఆల్కహాల్ లో నిద్రమాత్రలు కలుపుకొని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఫటాఫట్ విజయలక్ష్మి, శోభ, మోనాల్ నావల్, ప్రత్యుష, నితిన్ కపూర్, కుషాల్ పంజాబీ, శ్రీనాథ్, సంతోష్ జోగి, మాయూరి, సాయి ప్రశాంత్, విజయసాయి ఇలా ఎంతో మంది నటులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యలకు ముఖ్య కారణం డిప్రెషెన్, ఒంటరిగా ఉండడం, క్షణికావేశానికి గురై ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తుంది. తాను డిప్రెషన్ కు వెళ్లానని సైక్రియాటిస్టు ఫ్యామిలి సపోర్టుతో బయటపడ్డానని మీడియా ముందు రివీల్ చేసి బాలీవుడ్ స్టార్ డిప్రెషన్ ను బయట పెట్టింది దీపికాపదుకొనే. మానసిక అనారోగ్యం గురించి మాట్లాడితే పోయేదేమీలేదు వ్యాకులత తప్ప అనే ధైర్యాన్ని తోటి నటినటులకు పంచింది. దీని మీద అవగాహన కల్పించడానికి తన చెల్లి అనిషా పదుకొనెతో కలిసి ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ను స్థాపించింది. ప్రియాంక చోప్రా, అలియా భట్, పరిణితీ చోప్రా వంటి తారలు తాము డిప్రెషన్ ను ఎదుర్కొన్నాం అని కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో దాన్నుంచి రిలీవ్ అయ్యామని చెప్పారు. దృష్టికి రాని ఇలాంటి సెలెబ్రిటీలు ఇంకెందరో ధైర్యమివ్వడానికి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *