V Movie Releasing On OTT Platform In Telugu

సుధీర్ బాబు, నాని, నివేదా థామస్, అధితిరావ్ హైదరి ముఖ్యపాత్రల్లో నటించిన వి సినిమా ఎట్టెకులకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్,హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదల అవుతుందా? ఓటీటీలో విడుదల అవుతుందా అనే సందిగ్ధం చాల రోజులు కొనసాగింది.

“పన్నెండు ఏళ్లుగా నా కోసం మీరు థియేటర్ కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీకు ధన్యవాదాలు చెప్పడానికి మీ ఇంటికే వస్తున్నాను.మీ స్పందన తెలుసుకోవాలని ఉత్సుకతతో పాటు వి మూవీ సినిమా విషయంలో నెర్వస్ గాను అనిపిస్తుంది”. అంటూ కొత్తగా రిలీజ్ అయినా వీడియోలో హీరో నాని పేర్కొన్నారు. నా కెరీర్ లో ఎంతో ప్రతేకమైన ఇరవై ఐదవో చిత్రం డిజిటల్ ఫార్మాట్ లో విడుదల అవుతున్నందుకు చాల ఉద్వేగంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలా డిజిటల్ ఫార్మటులో విడుదల కావడం నాకు గొప్ప మధుర అనుభూతిని మిగిలిపోయేలా సెలెబ్రేట్ చేసుకుందాం. థియేటర్లు తెర్చుకున్నాక టక్ జగదీశ్ అనే సినిమాతో మీ ముందు ఉంటా ఒట్టు అని నాని అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్టు చేసాడు.

ఇప్పటి వరకు ఓటీటీలో విడుదల అయినా సినిమాలో ఎక్కువ బడ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావడం విశేషం. వీ సినిమాను నిర్మించడానికి 25 నుంచి 30 కోట్ల ఖర్చు అయిందని, ఈ సినిమాను 33 కోట్లతో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ అయిదు నా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఓటీటీలో ఇప్పటివరకు విడుదల అయినా సినిమాలలో భారీ బడ్జెట్ ఉన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి ఎంతవరకు ఈ సినిమా ఎంత వరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఓటీటీలో తెలుగులో సినిమాలు తక్కువగానే విడుదల అవుతున్నాయి.

ఈ సినిమా మీద బారి అంచనాలే ఉన్నాయి. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్ భారీ తారాగణం ఉంది ఈ సినిమాకి. ఇప్పటికే విడుదల అయినా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం కొంత వరకు ఓటీటీలో పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా ఫలితం వచ్చే సినిమాల ఓటీటీలో విడుదల చెయ్యాలా వద్ద అనే అంశం ఆధారపడి ఉంది. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎత్తేకులకు సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్లు ఇంకా తెరవలేదు, ఎప్పుడు తెర్చుతారో తెలియని పరిస్థితి ఒకవేళ తెరిచిన ప్రేక్షకులు వస్తారో రారో తెలియని పరిస్థితి అందుకే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా బాగా ఆడాలని తెలుగు సినిమాలు కూడా ఓటీటీ విడుదలను ఆహ్వానించాలని తెలుగు చిత్ర సీమ మూడు పువ్వులు ఆరు కాయలతో ఉండాలని కోరుకుందాం.

You may also like: ఓటీటీలో సినిమాల పరిస్థితి ఏంటి?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *